ఎట్టకేలకు OG ట్రైలర్ వచ్చేసింది. ఆదివారం ఉదయం నుంచి ఈ ట్రైలర్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఫ్యాన్స్ కోసం ట్రైలర్ ప్లే చేశారు. కానీ అవుట్ పుట్ మాత్రం బయటకు రాలేదు. డీఐ పనులు పూర్తవ్వకపోవడంతో.. ట్రైలర్ లేట్ అయిపోయింది. మొత్తానికి ఆ పనులు పూర్తి చేసుకొని.. కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు.
ఓజీ వేడుకలో చూపించిన ట్రైలర్.. ఈ ట్రైలర్ ఒక్కటే ఎలాంటి మార్పుల్లేవు. 2 నిమిషాల 40 సెకన్ల ట్రైలర్లో ఎలివేషన్లకు కొదవ లేకుండా చూసుకొన్నాడు సుజిత్ ‘ముంబై వస్తున్నా.. తలలు జాగ్రత్త’ అంటూ పవన్ చెప్పిన డైలాగ్‌తో విధ్వంసం మొదలైంది. చివర్లో.. పవన్ కల్యాణ్ వన్ మాన్ షో నడిచింది. పవన్ ని చాలా స్టైలీష్‌గా చూపించే ప్రయత్నం చేశాడు సుజిత్. తన టేకింగ్ కి… తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తోడయ్యింది. ఇమ్రాన్ హష్మీ ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్ర పోషించాడు. తన లుక్ కూడా చాలా బాగా డిజైన్ చేశాడు సుజిత్.
ముంబైని గడగడలాడించి, అజ్ఞాతవాసం చేసిన ఓ గ్యాంగ్ స్టర్ కథ ఇది. తను మళ్లీ ముంబై ఎందుకు వచ్చాడు? వచ్చి ఏం చేశాడన్నది కథ. ‘ఓజీ’ టీజర్లో ‘అలాంటోడు మళ్లీ వస్తే..’ అనే డైలాగ్ బాగా పాపులర్ అయ్యింది. అంత పవర్ఫుల్ డైలాగ్ ఈ ట్రైలర్లో కనిపించలేదు. కాకపోతే ఆ ఎనర్జీని సుజిత్ మ్యాచ్ చేయగలిగాడు. 25న ఈ సినిమా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హైప్ ఆకాశాన్ని తాకింది. ఈ ట్రైలర్ తో అది మరింత పెరగడం ఖాయం.
