పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ నుంచి ఒక సర్ప్రైజ్ వచ్చింది. పవన్ జపనీస్ లో పాడిన పాట రిలీజ్ అయ్యింది. ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మి ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. పవన్, ఇమ్రాన్ మధ్య గట్టి యుద్ధమే వుండబోతుందని ఇప్పటివరకూ వస్తున్న కంటెంట్ చూపిస్తోంది.
పవన్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన గ్లింప్స్ లో ఇమ్రాన్ స్పెషల్ ఎట్రాక్షన్ నిలిచారు. ‘‘డియర్ ఓజీ. నిన్ను కలవాలని.. నీతో మాట్లాడాలని.. నిన్ను చంపాలని ఎదురు చూస్తున్నా. హ్యాపీ బర్త్డే ఓజీ’’ అంటూ ఓమీ పాత్రలో ఇమ్రాన్ చెప్పిన డైలాగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇప్పుడు పవన్ పాడిన పాట కూడా ఓమి పాత్రని ఉద్దేశించినదే. ”మై డియర్ ఓమీ. ఎగిరెగిరి పడుతున్నావు. నీలాంటి వాడిని ఎలా నేలమీదకి దించాలో నాకు తెలుసు. చిన్నప్పుడు నా గురువు చెప్పిన హైకు చెప్తాను విను.వాషి ఓ వాషి…’ అంటూ పవన్ చెప్పిన ఓ జపనీస్ హైకు ఓజీకి కావాల్సినంత బజ్ ని యాడ్ చేసింది. సినిమా ఈ నెల 25న థియేటర్లలోకి రానుంది. ఇప్పుడు పవన్ పాడిన హైకు బయటికి రావడం ఫ్యాన్స్ కి డబుల్ కిక్ ఇచ్చింది.
