ఆసియా కప్ లో భారత జట్టు శుభారంభం చేసింది. అనుకొన్నట్టుగానే పసికూన అయిన యూఏఈని 9 వికెట్ల తేడాతో చిత్తు చిత్తు చేసింది. టాస్ గెలిచి.. ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పగించింది టీమ్ ఇండియా. కులదీప్ 4 వికెట్లతో విశ్వరూపం చూపించడంతో కేవలం 57 (13.1 ఓవర్లలో) పరుగులకే చాప చుట్టేసింది. ఆల్ రౌండర్ శివమ్ దూబేకి మూడు వికెట్లు పడ్డాయి. అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత్ ఈ లక్ష్యాన్ని కేవలం 27 బంతుల్లోనే ఛేదించింది. అభిషేక్ శర్మ 30 (16), శుభమన్ గిల్ 20 నాటౌట్ (9) చెలరేగి ఆడారు. సూర్య కుమార్ యాదవ్ 7 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. రెండు జట్లూ కలిసి కనీసం 20 ఓవర్లు కూడా ఆడలేదు. కేవలం రెండు గంటల్లోనే ఈ మ్యాచ్ ముగిసింది.
ఆసియా కప్ లో భాగంగా మంగళవారం జరిగిన తొలిమ్యాచ్‌లో ఆఘ్గనిస్థాన్ హాంకాంగ్ ని చిత్తుగా ఓడించిన సంగతి తెలిసిందే. రేపు బంగ్లాదేశ్, హాంకాంగ్ జట్ల మధ్య మ్యాచ్ జరగబోతోంది. ఈ ఆదివారం చిరకాల ప్రత్యర్థులైన భారత్ – పాక్ తలపడబోతున్నాయి. ఈ సిరీస్‌కే ఈ మ్యాచ్ హైలెట్ కాబోతోంది. భారత్ – పాక్ దేశాల మధ్య ఉదృక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఈ మ్యాచ్ మరింత ఆసక్తిగా మారబోతోంది
